
రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయ తరగతులు
గోరంట్ల: పాలసముద్రం సమీపంలోని నాసన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం (సెంట్రల్ స్కూల్)లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనిఫాంతో ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు చేరుకోవాలన్నారు. పాఠశాల ప్రారంభోత్సవానికి నాసిన్ డీజీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరవుతారన్నారు. ఇప్పటికే ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రులతో ఓరియంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేసినట్టు తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో చదివే విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ, విద్య అందిస్తామని తెలిపారు.