
14 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశం
మడకశిర రూరల్: మండలంలోని గుండుమలలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉద్యోగ విజయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ భాస్కర్, బిట్ కళాశాల ఈఈఈ విభాగాధిపతి గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. సాంకేతిక విద్యలో మెరుగైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పటికే వివిధ కంపెనీల్లో ఉద్యోగులుగా స్ధిరపడ్డారని గుర్తు చేశారు. అనంతరం నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్స్‌లో బెంగళూరులోని డుటచ్ ఇండియా పవర్ కన్‌సెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సంవత్సరానికి రూ.2.2 లక్షల వేతనంతోడిప్లొమా ఇన్ ఎలక్ట్రకల్, ఎలక్టానిక్స్ విభాగానికి చెందిన 8 మంది విద్యార్థులు, హిందూపురంలోని మంజునాథ పవర్ లూమ్స్, టైక్స్‌టైల్ కంపెనీలో ఏటా రూ.2 లక్షల వేతనంతో ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులు ఆర్డర్ కాప్లీను ప్రిన్సిపాల్ మద్దిలేటి అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రదీప్‌కుమార్, శిక్షణ అధికారి రూపేష్‌కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.