టీడీపీ మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు అధికారులతో కుమ్మకై ్క టెండర్లు వేస్తాడు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత పనులు చేయకుండా వదిలేస్తాడు. అందుకే అతన్ని బ్లాక్‌లిస్టులో పెట్టాలని సీఎంఓకు లేఖ రాశా. ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీని కలిసి చెప్పా. అయినా ఆ కంపెనీని అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచలేదు. మడకశిర నియోజకవర్గంలో చాలా వర్కులు పెండింగ్‌లో ఉంచడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కాంట్రాక్టర్‌ను మార్చాలని చెబితే... మరో సంస్థ పేరుమీద టెండరు వేసి పని అతనికే అప్పగించారు. దీనివెనుక భారీగా సొమ్ములు మారినట్టు నా దృష్టికి వచ్చింది.
– తిప్పేస్వామి, శాసనసభ్యులు, మడకశిర