● ఓటమిని ముందే అంగీకరించిన టీడీపీ
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
గూడూరు రూరల్: నామినేషన్లను వేయనీయకుండా తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ మూకలు అడ్డుకోవడంపై మండిపడ్డారు. చివరి రోజున దాఖలుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కొందరు ఆఫీసర్లు మాత్రం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బలం లేకే నామినేషన్లను అడ్డుకుంటున్నారని విమర్శించారు. నియంతృత్వ పోకడలతో ప్రజల ఓటు హక్కును హరించే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్న వారిని సంఘ విద్రోహ శక్తులు, రౌడీమూకలుగా పేర్కొన్నారు. వారిని ఎవరు ఉసిగొల్పారో ప్రజలకు తెలుసునన్నారు. బలమైన అభ్యర్థులను అరెస్ట్ చేయించి విజయం సాధించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ప్రక్రియను అడ్డుకోవడమంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లు అన్నారు. గూడూరులో తమ పార్టీ బలంగా ఉందని, ఎన్ని అడ్డంకులను సృష్టించినా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలుస్తారని పేర్కొన్నారు.
సమయమొచ్చినప్పుడు తగిన సమాధానం
మితిమీరిన శైలిని అవలంబిస్తున్నా, ఇప్పటి వరకు సంయమనం పాటిస్తున్నామని.. సమయమొచ్చినప్పుడు తగిన విధంగా సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించి.. గెలిస్తేనే దాన్ని నిజమైన విజయంగా భావించాలని చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక ఎలా ఉంటుందో చెప్పడానికి గురవయ్యే నిదర్శనమని తెలిపారు.
అక్రమ కేసులు
తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. శాంతియుతంతా ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యే చెప్తున్నారని, అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాలను తమ పార్టీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నేతలు చేవూరు విజయమోహన్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేసిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని పేర్కొన్నారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థులను అభినందించారు. సీనియర్ నేత యద్దల నరేంద్రరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, గూడూ రు, కోట మండల కన్వీనర్లు మల్లు విజయకుమార్‌రెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, నేతలు బల్లి వెంకటేశ్వర్లు, అట్ల శ్రీనివాసులురెడ్డి, యల్లా శ్రీనివాసులురెడ్డి, సతీష్‌రెడ్డి, రమేష్, సునీల్‌రెడ్డి, కృష్ణయ్య, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


