మర్రిపాడులో పచ్చ అరాచకం | - | Sakshi
Sakshi News home page

మర్రిపాడులో పచ్చ అరాచకం

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

మర్రిపాడు: మండలంలోని సింగనపల్లిలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డాయి. అభ్యర్థి ఖాన్‌సా నామినేషన్‌ పత్రాలను చించేసి.. కాలితో తన్నారు. ఎన్నికల అధికారి ముందే ఈ ఘటన జరిగిందని పార్టీ నేతలు ఆరోపించారు. పరిమితికి మించి లోపలికెళ్తున్నా, ఖాకీలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని పార్టీ నేత గంగవరపు శ్రీనివాసులునాయుడు ఆరోపించారు. నేతలు చెన్ను వెంకటేశ్వరరెడ్డి, సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి, దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement