స్థానిక సమరంలో గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరంలో గెలుపే లక్ష్యం

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

కోవూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఆయన్ను ఆ పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోట బిట్‌ – 1 ఎంపీటీసీ అభ్యర్థి యరమతి సాయిజ్యోత్స్న, కోట బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థులు ఇండ్ల వెంకటరమణమ్మ తదితరులు కూడా కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయపథంలో నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు. కోట మండలంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కోట మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి సునీల్‌రెడ్డి, టీయూసీ జనరల్‌ సెక్రటరీ దువ్వూరు సాయిరెడ్డి, మైనారిటీ విభాగం అధ్యక్షుడు మొయిన్‌బాషా, జిల్లా సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శి పలగాటి సాయిరెడ్డి, చంటి, సాయి, ప్రేమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement