ఉప్పుటేరులో భారీగా చేపల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

ఉప్పుటేరులో భారీగా చేపల మృత్యువాత

Oct 17 2026 12:04 AM | Updated on Oct 17 2026 12:04 AM

● విషవ్యర్థాలు కలవడమే కారణం

● ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు

అల్లూరు: ఆదినారాయణపురం నుంచి ఉప్పు భూములకు వెళ్లే మార్గంలోని ఉప్పుటేరులో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. నీటిలో విషవ్యర్థాలు కలవడమే ఇందుకు కారణమని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం చేపలు మృతిచెంది నీటిపై తేలుతుండటాన్ని గుర్తించిన మత్స్యకారులు లబోదిబోమన్నారు. ఈ ఘటన గతంలోనూ చోటుచేసుకుందని గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని కంపెనీల నుంచి విషవ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఉప్పుటేరులో కలుపుతున్నారనే ఆరోపించారు. ఈ ఘటన ప్రభావం సుమారు రెండు కిలోమీటర్ల మేర కనిపించిందని పేర్కొన్నారు. చేపల వేటే తమ జీవనాధారమని, ఇలా భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో ఎలాంటి వ్యర్థాలు కలిశాయో తెలియకపోవడంతో, ఆ చేపలను తింటే ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఘటనకు కారణాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement