వైభవం.. దేవతామూర్తుల గ్రామోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. దేవతామూర్తుల గ్రామోత్సవం

Oct 17 2026 12:04 AM | Updated on Oct 17 2026 12:04 AM

అల్లూరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అల్లూరులోని దసరా దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున 13 దేవతామూర్తుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ వాహనాలపై దేవతామూర్తులను కొలువుదీర్చి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ప్రత్యేక పూల అలంకరణలతో దేవతామూర్తులు భక్తులకు దర్శనమివ్వడంతో వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. విఘ్నేశ్వరుడు, పార్వతీవర్ధిని, బాలా త్రిపురసుందరి, గాయత్రీదేవి, లలితాదేవి, అన్నపూర్ణాదేవి, శివపార్వతులు, సరస్వతీదేవి, రాజరాజేశ్వరీదేవి, మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి, వెంకటేశ్వరస్వామి, నరసింహస్వామిని 13 వాహనాలపై ప్రతిష్టించి గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానంలో గతంలో 12 దేవతామూర్తులతో గ్రామోత్సవాన్ని జరిగింది. 13 సంవత్సరాల సందర్భంగా ఈసారి 13 దేవతామూర్తులతో వేడుకలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్‌ నైట్‌, డీజే, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement