తల్లికి బాలిక అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తల్లికి బాలిక అప్పగింత

Oct 17 2026 12:04 AM | Updated on Oct 17 2026 12:04 AM

నెల్లూరు(పొగతోట): మంగళగిరిలోని ఇంటి నుంచి వెళ్లిపోయి గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాలికను డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ), చైల్డ్‌లైన్‌ సిబ్బంది సమన్వయంతో సంరక్షించారు. కౌన్సెలింగ్‌ అనంతరం శుక్రవారం నెల్లూరులోని ఐసీపీఎస్‌ కార్యాలయంలో తల్లికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి రైలులో గూడూరు చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు ఈ విషయాన్ని హెల్ప్‌లైన్‌కు తెలియజేశారు. దీంతో చైల్డ్‌లైన్‌ సిబ్బంది బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం బాలికకు, ఆమె తల్లికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణాధికారి బి.సురేష్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కండలేరులో 16.905

టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 16.905 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 63, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.125

సన్నవి : రూ.70

పండ్లు : రూ.40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement