నెల్లూరు(క్రైమ్): నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీల్లో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు ప్రాంతాల్లోని 44 నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ యంత్రాగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. 220 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని 20 నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర ఇన్స్పెక్టర్లు సీహెచ్ సీతారామయ్య, జి.వేణుగోపాలరెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, చిట్టెం కోటేశ్వరరావు, కె.సాంబశివరావు చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. నగర ఏఎస్పీ దీక్ష నగరంలోని పలు కేంద్రాలను పరిశీలించారు.


