గాంధీ ఆశ్రమం మరింత అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

గాంధీ ఆశ్రమం మరింత అభివృద్ధి

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

ఇందుకూరుపేట: పల్లిపాడులోని గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని గాంధీ ఆశ్రమంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఆశ్రమాభివృద్ధి, నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసి పునరుద్ధరణ పనులను చేపట్టామని వివరించారు. భావితరాలకు అందించే స్ఫూర్తిదాయక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తొలుత గాంధీ, స్థలదాత పొణకా కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు, ఖాదీవస్త్రాలను వేసి నివాళులర్పించారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన గాంధీ జీవిత చిత్రపటాలను వీక్షించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, తెలంగాణ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్‌ అథ్లెటిక్స్‌

ఎంపికలు రేపు

నెల్లూరు (టౌన్‌): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఎంపికలను ఆదివారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నామని వెటరన్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ, కార్యదర్శి బసవయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి 80 ఏళ్లు వయస్సు గల పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని చెప్పారు. 100, 200, 400, 800, 1500, ఐదు వేల మీటర్ల పరుగు పందెం, హై, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌, జావెలిన్‌, హ్యామర్‌ త్రో, ఐదు కిలోమీటర్ల నడక పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. ఆసక్తి గల వారు వయస్సు ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను తీసుకురావాలని సూచించారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూలైన్‌ చేరుకుంది. స్వామివారిని 78,026 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,166 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

పోలీస్‌ శిక్షణ కేంద్రంలో పరిశీలన

నెల్లూరు సిటీ: చెముడుగుంటలోని పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం పరిశీలించారు. కేంద్రంలోని కార్యాలయం, క్వార్టర్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ను పర్యవేక్షించారు. ప్రాంగణంలోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

వైన్‌ షాపుల రెన్యువళ్ల దరఖాస్తు గడువు పొడిగింపు

నెల్లూరు సిటీ: జిల్లాలో వైన్‌షాపులను రెన్యువల్‌ చేసుకోని వారు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆరో తేదీ రాత్రి 12 గంటల వ రకు అవకాశమిచ్చారు. దరఖాస్తులను ఎకై ్సజ్‌ అధికారులు ఏడున పరిశీలించి.. కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన ఎనిమిదిన కేటాయించనున్నారు. కాగా జిల్లాలోని 49 వైన్‌షాపుల రెన్యువల్‌కు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా, తొమ్మిదింటికే దరఖాస్తులందాయి. వీటికి 36 అప్లికేషన్లే రావడంతో కొన్ని మార్పులను ప్రభుత్వం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement