గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కృషి

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతులను పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వీరి చిత్రపటాలకు పూలమాలలేసి శుక్రవారం నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లామని, గాంధీ గ్రామ స్వరాజ్య ఆలోచనలకు అనుగుణంగా ఇది ఉందని చెప్పారు. పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement