నీటిలో తేలుతున్న బొజ్జ గణపయ్య విగ్రహం
వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజించిన విగ్రహాలను నెల్లూరులోని స్వర్ణాల చెరువులో నిమజ్జనం చేశారు. అయితే కొన్ని విగ్రహాలు పూర్తిగా కరగకపోవడంతో వాటి అవశేషాలు చెరువులో దర్శనమిస్తున్నాయి. దీంతో నీటి పరిశుభ్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విగ్రహాల రంగులు, ఇతర వ్యర్థాలు నీటిలో కలవకుండా నిమజ్జన ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. చెరువు నీటిపై ఆధారపడే మూగజీవాలకు ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


