వీఎస్‌యూ కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

వీఎస్‌యూ కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిరసన

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

వెంకటాచలం: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ అసోసియేషన్‌ ఆఫ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ఆన్‌ కాంట్రాక్ట్‌ ఆధ్వర్యంలో కాకుటూరు వద్దనున్న వర్సిటీ క్యాంపస్‌లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు, రెగ్యులరైజేషన్‌, సర్వీస్‌ పరిగణన తదితర అంశాలతో కూడిన వినతిపత్రాన్ని యూనివర్సిటీ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ కె.సునీతకు అందజేశారు. అనంతరం నిరసన దీక్షా శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు చేరుకుని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాకుటూరు, కావలి యూనివర్సిటీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, కాంట్రాక్ట్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.45

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement