వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

సంవత్సరం రైతులు నగదు

(కోట్లల్లో రూ.)

2020–21 10,495 రూ.1.99

2021–22 1,291 రూ. 2.69

2022–23 25,695 రూ. 5.75

ధాన్యం ధరలు

పాతాళానికి పతనం

రైతు భరోసా

లబ్ధిదారుల రైతులు

9,31,943

మంది

ఐదేళ్లలో వైఎస్సార్‌ రైతు భరోసా సాయం

రూ.1,510.70

కోట్లు

ఒక్కొక్క భవన నిర్మాణానికి నిధులు

రూ. 21.80

లక్షలు

రైతు భరోసా

కేంద్రాలు

656

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధాన్యం ధరలే కాదు.. ఏ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా దిగిపోయే 2004లో కూడా పుట్టి ధాన్యం రూ.4 వేలు దాటిన చరిత్ర లేదు. ఆ తర్వాత వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా ఏటా పెరిగాయి. వైఎస్సార్‌ హయాంలో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు ఎగబాకాయి. ఇక ప్రత్యేకించి జిలకర మసూరి రకం అయితే ఏకంగా రూ.17 వేల వరకు అప్పట్లోనే పలికాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014–19 మధ్య కాలంలో మద్దతు ధరలు బాగా పెరిగినప్పటికీ.. పుట్టి రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కొనే పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న జిలకర మసూరి రకాన్ని సైతం మిల్లర్లకు మేలు చేకూర్చేందుకు ‘ఏ’గ్రేడ్‌ రకంగా ముద్ర వేసి ఆ రకం ధాన్యం ధరలను గుట్ట కూల్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ మద్దతు ధరలు లభించేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది పుట్టి మద్దతు ధరకు మించి రూ.25 వేల వరకు రైతులు అమ్ముకున్నారు. తాజాగా పూర్తయిన ఖరీఫ్‌ సీజన్లో పుట్టి ధాన్యం రూ.15 వేల నుంచి రూ.17 వేల లోపే కొనుగోలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఒక్క ధాన్యం ధరలే కాకుండా గతేడాదితో పోల్చితే.. పసుపు రైతు పుట్టి ముంచారు. పొగాకు ధరలు అయితే కేజీకి రూ.100 తగ్గిపోయింది. మిర్చి ధరలు అయితే నేలచూ పులు చూస్తున్నాయి. మామిడి, సపోటా, నిమ్మ, బత్తాయి ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంటలకు ధరలు లేకపోతే ఎందుకు సాగు చేయడం అని సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అంటారు. అసలు పంటలే సాగు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతారు. మరి ప్రభుత్వం ఉండేది ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి వ్యవసాయాధారిత జిల్లాగా పేరుగాంచింది. ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడిపట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు.

ఆదుకుంటానని.. అప్పుల ఊబిలోకి..

జిల్లాలో సుమారు 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అత్యధికంగా దాదాపు 9 లక్షల నుంచి 9.5 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మిగతా మెట్ట పంటలు సాగవుతున్నాయి. ఇందులో సన్న, చిన్నకారు రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సుమారు 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.13,500 అందజేసింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల లెక్కన ‘అన్నదాత సుఖీభవ’ ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి మంగళం పలికారు. రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈకేవైసీ, ఆధార్‌లింక్‌, బ్యాంకు అకౌంట్‌ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్‌ పెట్టినట్లు వ్యవసాయశాఖ అధికారిక తెలుస్తోంది.

‘సూపర్‌’ మోసం

జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్‌ సిక్స్‌లో భాగంగా పీఎం కిసాన్‌ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగనామం పెట్టితే.. మలి ఏడాదిలో 1,95,866 మందికే ఇచ్చి సరిపుచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది.

సంవత్సరం దరఖాస్తు చేసుకున్న లబ్ధి చేకూరిన ఆర్థిక సాయం

రైతులు రైతులు (రూ.కోట్లల్లో)

2024–25 3,19,000 – –

2025–26 3,19,000 1,95,866 289.05

2026–27 (ఈ ఏడాదికి ఇంకా ఎప్పుడు జమ చేసేది స్పష్టత లేదు.)

వైఎస్సార్‌సీపీ పాలనలో సున్నా వడ్డీ

అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా.. ఫలితం శూన్యం

84,134 మంది

రైతుల దరఖాస్తులు పెండింగ్‌

కౌలు రైతులకు పంగనామాలు

సున్నా వడ్డీ చెల్లింపులకు దిక్కులేదు

ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి

రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఊసేలేదు

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం

టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ

రైతు భరోసా పడేది.. సుఖీభవ పడట్లేదు

నాకు ఒక ఎకరం మాగాణి భూమి ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో నాకు క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా జమయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏడాది అసలు వేయలేదు. రెండో ఏడాదిలో కూడా పడకపోవడంతో వెళ్లి అడిగితే.. సాంకేతిక కారణంతో నగదు జమ కాలేదని అధికారులు చెప్పారు. రెండో సారి వెళ్తే.. ఆధార్‌ లింక్‌ కాలేదని చెప్పారు. సరి చేస్తామని చెప్పినా.. ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మూడో ఏడాదైనా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇస్తుందో లేదో తెలియదు. – పిల్లి బాలమ్మ, బల్లవోలు, చిల్లకూరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement