ఆర్టీసీ డిపోను ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపోను ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యమిస్తాం

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

సీపీఎం, సీపీఐ నాయకులు

నెల్లూరు సిటీ: నెల్లూరులోని ఆర్టీసీ డిపో–2ను ప్రైవేట్‌పరం చేస్తే సహించేది లేదని, ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ హెచ్చరించారు. 2 డిపోను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 86 రోజులుగా డిపో ఎదుట కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా మంగళవారం వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూలం రమేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను స్వాగతిస్తామన్నారు. అయితే వాటిని సంస్థ ఆధ్వర్యంలోనే నడపాలన్నారు. ప్రైవేటీకరణ పేరుతో రూ.వేల కోట్లు ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. సీపీఐ జిల్లా నాయకుడు రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే ఐక్య పోరాటాలతో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు సాగర్‌, మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, సునీల్‌, వెంకమరాజు, పులిగండ్ల శ్రీరాములు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement