రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై సదస్సు నేడు | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై సదస్సు నేడు

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

మాజీ మంత్రి కాకాణి

నెల్లూరురూరల్‌: రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణపై జిల్లాలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రధాన నాయకులు, రైతులతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నగరంలోని గాంధీనగర్‌లోని ఆర్‌ఎస్‌ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించన్నునారు. ఈ సమావేశ ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతులతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొని చర్చించాలన్నారు. అందరితో సమాలోచనల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతలను సాధించి నెల్లూరు జిల్లా రైతాంగానికి భవిష్యత్‌లో సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపడుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement