ముగిసిన హుండీల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన హుండీల లెక్కింపు

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని ప్రము ఖ క్షేత్రమైన హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గా హుండీ లెక్కింపు ఆదివారంతో ముగిసింది. గత 22 నెలల తర్వాత హుండీలు లెక్కింపునకు కోర్టు ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు అధికారులు అనుమతివ్వడంతో ఈ లెక్కింపు ప్రక్రి య పది రోజులుగా కొనసాగింది. 22 హుండీలను లెక్కించగా రూ.3,18,37,833 నగదు, 98.55 గ్రాముల బంగారం, 12.991 కేజీల వెండి వచ్చినట్లు దర్గా ఈఓ హుస్సేన్‌ తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేసిన ట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు సయ్యద్‌ ఎస్‌డీ ఆదాం, షఫీ, ఇబ్రహీం బేగ్‌, ఎస్‌కే రవూఫ్‌, ఎండీ హుస్సేన్‌, ఖాజా మొహిద్దీన్‌, దర్గా ఇన్‌స్పెక్టర్‌ కుదావన్‌, దర్గా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

16 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 91,005 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,257 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement