నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘తెలుగుదేశంలో ఆధిపత్య పోరు ఉంది. ఆ పార్టీలో మేము కొనసాగలేం. వైఎస్సార్‌సీపీలో చేరుతాం’ అని నెల్లూరులోని 53, 54 డివిజన్లకు చెందిన పలువురు ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పారు. ఆయన ఆదివారం జనార్దనరెడ్డి కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా 54వ డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకులు ఎస్‌కే మంజు అహ్మద్, ఎస్‌కే దస్తగిరి ఎమ్మెల్సీ వద్దకెళ్లి తాము అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతామని చెప్పారు. రెండురోజుల క్రితం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నేత బాగి వెంకటరమణ 100 మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ఆ రెండు డివిజన్ల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.


