సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరం మీదుగా గురువారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. మినీలారీలో బెంగళూరు నుంచి మండల పరిధిలోని రేవూరు గ్రామానికి వ్యర్థాలను తరలిస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తూ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక స్టేషన్‌కు సమీపంలోని ఏఎంసీ యార్డు ప్రాంగణానికి తరలించారు. దీంతో స్థానికులు దుర్వాసన భరించలేకున్నా రు. అనారోగ్యం బారిన పడేలా ఉన్నామని స్టేషన్‌కు వెళ్లి చెప్పినా శుక్రవారం సాయంత్రం వరకు వాహనాన్ని అక్కడ్నుంచి తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కండలేరులో
43.540 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 43.540 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


