సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిది | - | Sakshi
Sakshi News home page

సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిది

May 2 2026 11:37 AM | Updated on May 2 2026 11:37 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు

నెల్లూరురూరల్‌: సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో కలిసి కాకాణి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేసి ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, కార్మికులకు తినిపించారు. మున్సిపల్‌ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ మేడేను పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ తరపున జిల్లా ప్రజలకు, కార్మిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులను వంచిస్తోందన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. సమాజ ప్రగతికి, అభివృద్ధికి కార్మికులు చిందిస్తున్న స్వేదం, వారి త్యాగాలు ఎంతో విలువైనవన్నారు. రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.కూటమి ప్రభుత్వంలో కార్మికులకు సరైన గుర్తింపు, మద్దతు కరువైందన్నారు. జగనన్న ప్రభుత్వ హయాంలో కార్మికులకు అన్ని విధాలా మంచి జరిగిందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కార్మిక లోకానికి, ట్రేడ్‌ యూనియన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయన్నారు. రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మే డేను జరపడం ఆనందదాయకమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కార్మికులను ఎన్నడూ మరవరని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి,

ఆనం విజయకుమార్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు

కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న కాకాణి పూజిత

ఆటో నడుపుతున్న

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరురూరల్‌: కార్మిక లోకానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, నగర వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని వీఆర్సీ సెంటర్‌లో వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘ నాయకులు మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని కార్మిక సంఘాల నేతలతో కలిసి సరదాగా ఆటో నడిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని ఆయన గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement