నెల్లూరురూరల్: జిల్లా ప్రగతికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి జిల్లా ప్రగతికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, ప్రాధాన్యత రంగాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా ప్రగతికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, సీపీఓ నరసింహారావు, ఆర్డీఓలు అనూషా, పావని, సత్యనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


