న్యాయమూర్తులకు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులకు వీడ్కోలు

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

నెల్లూరు (లీగల్‌): నెల్లూరు అదనపు జిల్లా కోర్టుల న్యాయమూర్తులు తేజోవతి, శ్రీనివాస్‌, సరస్వతి, సోమశేఖర్‌, సిరిపిరెడ్డి సుమ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వీరికి వీడ్కోలు సభను నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ హాజరై వారి సేవలను కొనియాడారు. అనంతరం సత్కరించారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సత్తు అంకయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యప్పరెడ్డి, నాగరాజయాదవ్‌, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement