
ఊరూవాడా గణపయ్య సంబరం
● భక్తిశ్రద్ధలతో వినాయకచవితి
● వివిధ రూపాల్లో కొలువుదీరి..
నెల్లూరు(బృందావనం): వినాయకచవితి పండగను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరులో విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి, వివిధ మిత్రమండళ్లు, యువత ఆధ్వర్యంలో భారీ మండపా ల్లో తాత్కాలికంగా ప్రతిష్టించిన గణపతిని ప్రజలు దర్శించుకున్నారు. ఆనందోత్సాహాలతో ఉట్టి కొడుతూ సంబరాలు చేసుకున్నారు. బాలాజీనగర్, ట్రంకురోడ్డు శివాజీ సెంటర్, పెద్దబజారు, చిన్నబజారు, రాణాప్రతాప్ సెంటర్, కాపువీధి, వేదాయపాళెం, చిన్న బజారు, శెట్టిగుంటరోడ్డు తదితర ప్రాంతాల్లో గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు దాతల సహకారంతో తీర్థ, ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్, పెన్నా బ్యారేజీల వద్ద తొలిరోజు నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం

ఊరూవాడా గణపయ్య సంబరం