
దేశ సేవలో ‘ఉదయగిరి’ యుద్ధనౌక
ఉదయగిరి: జిల్లాలో చారిత్రాత్మక రాచరిక కేంద్రంగా విరాజిల్లిన ‘ఉదయగిరి’ పేరు మీద ఐఎన్‌ఎస్ యుద్ధనౌకను మంగళవారం నావికాదళంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశ సేవకు అంకితమైంది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణులు అమర్చబడ్డాయి అధునాతన సెన్సార్‌లు, ఆయుధాలతో కూడిన స్టెల్త్ టెక్నాలజీతో ఇది నింగి, నీటిలోనూ సమర్థవంతంగా పనిచేస్తోంది. జలాంతర్గామి ముప్పును ఎదుర్కొంటుంది. 2025 జూలై 1న దీనిని భారత నౌకాదళానికి అప్పగించారు. అధికారికంగా మంగళవారం ప్రవేశ పెట్టారు. ఇది భారత్, రష్యా సహకారంతో నిర్మితమైన 51వ యుద్ధనౌక.