భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో సహజీవనం.. వివాహిత అనూహ్య నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో సహజీవనం.. వివాహిత అనూహ్య నిర్ణయం

Aug 10 2023 7:10 AM | Updated on Aug 12 2023 12:22 PM

- - Sakshi

వివాహిత భర్తతో విభేదించి ముత్తుకూరు బీసీ కాలనీలో నివాసం ఉంటోంది. కొద్ది నెలలుగా దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

ముత్తుకూరు : ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముత్తుకూరులో జరిగింది. ఎస్సై శివకృష్ణారెడ్డి కథనం మేరకు.. పంటపాళెం పంచాయతీలోని కోళ్లమిట్టకు చెందిన నాసిన శ్రీలేఖ (28) అనే వివాహిత భర్తతో విభేదించి ముత్తుకూరు బీసీ కాలనీలో నివాసం ఉంటోంది. కొద్ది నెలలుగా దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

గొడవలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. దుర్గాప్రసాద్‌ వెలుపలకు వెళ్లగానే శ్రీలేఖ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని మృతి చెందింది. కొద్దిసేపటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ ఇంటి తలుపులు వేసి ఉండడంతో గట్టిగా కేకలు వేసినా తలుపులు తెరవలేదు. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ శ్రీలేఖ కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై తన సిబ్బందితో మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement