గ్రామ దేవతల భూములకు సంబంధించి దొంగ పట్టాలు సృష్టించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఎం.చిన్న వెంకటేశ్వర్లు, ఎన్.రమణయ్య, ఎం.సోమయ్య వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 591లో 2.31, 592లో 2.31 ఎకరాలు భూమికి దండు కృష్ణయ్య, చేజర్ల తిరుపాలు దొంగ పట్టాలను సృష్టించారన్నారు. ఆ భూమిలోకి ప్రవేశిస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి అక్రమ పట్టాలను రద్దు చేసి దేవాలయ భూములను యథావిధిగా కొనసాగించాలని కోరారు.


