నెల్లూరు(టౌన్): మారుతి సుజుకి న్యూ బ్రెజ్జా కారును సోమవారం యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాస్, భార్గవి ఆటోమొబైల్స్ ఫౌండర్, చైర్మన్ కొండా బలరామిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్‌రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. భార్గవి ఆటోమొబైల్స్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.7.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కారు 1.5 లీటరు ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తోపాటు సరికొత్త టర్బో ఇంజిన్ ఆప్షనర్ ఉందన్నారు. 7 సింగిల్, 3 డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుందన్నారు. ఫ్రంట్ వార్నింగ్ సెన్సార్లు, ఎమర్జెన్సీ స్టాఫ్ సిగ్నల్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, 360 డిగ్రీల కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డీజీఎం రమేష్‌బాబు, మహేష్ , చీఫ్ జనరల్ మేనేజర్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నిస్సాన్ టెక్‌టాన్ కారు ఆవిష్కరణ
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని ఎంజీబీ మాల్లో హైటెక్ నిస్సాన్ షోరూం నిర్వాహకులు సోమవారం నూతన టెక్‌టాన్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాఽథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కారులో వైర్‌లెస్ చార్జర్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ ఏసీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.10.49 లక్షలన్నారు. బుకింగ్ కోసం 90142 11044 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమా రెడ్డి, ఆశీష్‌రెడ్డి, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత భయ్యా వాసు, ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ, హెచ్‌డీఎఫ్‌సీ ఏరియా మేనేజర్ వెంకట్, హైటెక్ నిస్సాన్ జనరల్ మేనేజర్ ఎన్‌వీఎస్ శాస్త్రి, సేల్స్ మేనేజర్ బ్రహ్మకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కండలేరులో
26.46 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 26.46 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.45
సన్నవి : రూ.25
పండ్లు : రూ.10


