నెల్లూరురూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలతో నెల్లూరులోని కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, మెప్మా పీడీ కిరణ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్‌రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి వినతులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.
40 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలి
కోవూరు కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారంలో సుమారు 40 ఏళ్లపాటు కన్సాలిడేటెడ్ ఎన్‌ఎంఆర్/ఎన్‌ఎంఆర్ కార్మికులుగా పనిచేసిన 243 మందికి న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందింది. బాధితులు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులకు లభించే సెలవులు, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగక జీవనోపాధి కోల్పోయామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీ ఒక్కో కార్మికుడికి సుమారు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
కోట గురుకులాన్ని కొనసాగించాలంటూ బీఎస్పీ ధర్నా
హామీలు నెరవేర్చాలని ఐద్వా డిమాండ్


