ధోనితో ఉన్న వీడియో షేర్‌ చేసిన యువీ | Yuvraj Singh Syas Farewell To MS Dhoni With Video | Sakshi
Sakshi News home page

‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’

Aug 17 2020 9:06 AM | Updated on Aug 17 2020 2:22 PM

Yuvraj Singh Syas Farewell To MS Dhoni With Video - Sakshi

2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను.

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ ట్విటర్‌లో స్పందించారు. ధోనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో తనతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యువీ షేర్‌ చేశారు. ‘నీ గోప్ప కేరీర్‌కు అభినందనలు. 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను. రిటైర్మెంట్‌  అనంతరం మంచి భవిష్యత్‌​కు నీకివే నా శుభాకాంక్షలు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు యువీ. ఆయన షేర్‌ చేసిన వీడియోలో ధోనితో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి. కాగా, మిడిల్‌ ఆర్డర్‌లో విజయవంతంగా రాణించిన యువీ, ధోని జంట టీ-20, వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ మహేంద్ర సింగ్‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement