
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. బంగ్లాను తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా జట్టు రెండు మార్పులు చేసింది. పేసర్ ఖాలీద్ ఆహ్మద్, స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తుది జట్టులోకి వచ్చారు.
యశస్వీ సూపర్ క్యాచ్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఆకాష్ దీప్ మూడో బంతిని గుడ్-లెంగ్త్ డెలివరీ జకీర్‌కు సంధించాడు.
ఆ డెలివరీని జకీర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి థిక్స్ ఎడ్జ్ తీసుకుని గల్లీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ తన కుడివైపునకి డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.
ఇది చూసిన బంగ్లా బ్యాటర్ దిమ్మతిరిగిపోయింది. దీంతో 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే జకీర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. జైశ్వాల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IPL 2025: సీఎస్‌కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
Jaiswal pounces like a panther to take the catch! 👌#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/cfg394XfMm
— JioCinema (@JioCinema) September 27, 2024