breaking news
Zakir
-
జైశ్వాల్ సంచలన క్యాచ్.. బంగ్లా బ్యాటర్ మైండ్ బ్లాంక్(వీడియో)
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. బంగ్లాను తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా జట్టు రెండు మార్పులు చేసింది. పేసర్ ఖాలీద్ ఆహ్మద్, స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తుది జట్టులోకి వచ్చారు.యశస్వీ సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఆకాష్ దీప్ మూడో బంతిని గుడ్-లెంగ్త్ డెలివరీ జకీర్‌కు సంధించాడు. ఆ డెలివరీని జకీర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి థిక్స్ ఎడ్జ్ తీసుకుని గల్లీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ తన కుడివైపునకి డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బంగ్లా బ్యాటర్ దిమ్మతిరిగిపోయింది. దీంతో 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే జకీర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. జైశ్వాల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్ Jaiswal pounces like a panther to take the catch! 👌#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/cfg394XfMm— JioCinema (@JioCinema) September 27, 2024 -
‘దెయ్యం గుడ్డిది ఐతే?’
సుమీత్, జాకీర్, హైమ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘దెయ్యం గుడ్డిది ఐతే?’. దాసరి సాయిరాం దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం అనే కథాంశంతో ఉన్న సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘దెయ్యం గుడ్డిది ఐతే’ అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
చాపర్ బైక్ సూపర్!
యశవంతపుర: రద్దీ రోడ్లపై 13 అడుగుల బైకు నడపడం సాధ్యమా? అంత కష్టమేం కాదంటున్నాడు జాకీర్. బెంగళూరులోని నాగరబావికి చెందిన జాకీర్(29) ఇంటీరియర్ డిజైనర్. కొత్తగా ఏదైనా చేసేందుకు వాహనరంగాన్ని ఎంచుకున్నాడు. ఇంటి వద్దనే వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకుని వేర్వేరు సంస్థల బైక్ విడిభాగాలు సమకూర్చుకున్నాడు. సుమారు నెలన్నరపాటు శ్రమించి రూ.7.5లక్షలు ఖర్చు చేసి 220 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌తో 450 కిలోల బరువు, 13 అడుగుల పొడవు, 5.5 అడుగుల వెడల్పుతో ఉన్న చాపర్ బైక్ తయారుచేశాడు. ఒక్కరు మాత్రమే కూర్చునేందుకు వీలుండే ఈ బైక్‌పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. అన్ని ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ వెనుక వైపు ఉండగా దీనికి మాత్రం ముందు భాగంలో ఏర్పాటు చేశాడు. ముందు చక్రం చిన్నదిగా, వెనుక చక్రం పెద్దదిగా ఉంది. వెనుక చక్రం మినీ ట్రక్ టైర్లా ఉంటుంది. ఈ చాపర్ బైకును శని, ఆదివారాల్లో జేపీ నగరలోని శ్రీ దుర్గా పరమేశ్వరి బీడీఏ మైదానంలో అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన బైక్‌గా ఇది రికార్డు సృష్టించనుందని జాకీర్ ధీమావ్యక్తంచేశారు. -
వన్ సైడ్లవ్కు ‘ధన్య’ బలి
ప్రేమోన్మాదుల కిరాతకానికి మరో అబల బలైంది. మరెంతమంది బలికావాల్సి వస్తుందో అన్న ఆందోళన రాష్ట్రంలో ఏర్పడింది. మూడు నెలల్లో ఆరుగురు హతమయ్యారు. ‘వన్ సైడ్ ప్రేమ’ వ్యవహారంలో యువకులు తనకు దక్కంది మరొకరికి దక్కకూడదన్నట్టుగా ఉన్మాదులుగా మారి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సాక్షి, చెన్నై: వన్ సైడ్ ప్రేమ పేరుతో యువతులకు వేధింపులు నానాటికి రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే యువతులకు భద్రత కరువైనట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్న కొందరు యువత ఒడి గడుతున్న ఘాతుకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మూడు నెలల్లో ఆరుగురు యువతులు ఒన్ సైడ్ ప్రేమకు బలి కావడం తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి. నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కలకలం సృష్టిస్తే, విల్లుపురంలో నవీన ఆహుతి ఆందోళన ను రెట్టింపు చేసింది. కరూర్‌లో తరగతి గదిలో సోనాలి హత్య, విరుదాచలంలో పుష్పలత, తూత్తుకుడిలో ఫ్రాన్సీనా హత్యలు వన్ సైడ్ ప్రేమోన్మాదుల ఘాతకమే. తాజాగా, బుధవారం సాయంత్రం కోయంబత్తూరులో ధన్య(23) బలి అయింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన దన్యను ప్రేమోన్మాది కాటేశాడు. ఈ వరుస ఘటనలతో రాష్ర్టంలో యువతులకు భద్రత ఉందా..? అన్న ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. మరో బలి : కోయంబత్తూరు జిల్లా అన్నూర్ తెన్న పాళయం వీజీపీ మహల్‌కు చెందిన సోము, శారద దంపతుల కుమార్తె ధన్య(23). బీఎస్సీ - ఐటీ పూర్తి చేసిన ధన్య అన్నూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేసేది. పది రోజుల క్రితం అన్నూర్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు దినేష్‌తో ధన్యకు వివాహ నిశ్చయతార్థం జరిగింది. బుధవారం ఓనం పండుగ కావడంతో తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన ధన్య ఐదున్నర గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరింది. ధన్య రాగానే, ఆమె తండ్రి సోము, తల్లి శారద ఆసుపత్రికి వెళ్లారు. గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన సోము, శారద అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ధన్యను చూసి రోదిస్తూ పెట్టిన కేకలు కలకలం రేపాయి. ఆ పరిసర వాసులు ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. అతి దారుణంగా ఆమె హత్యకు గురై ఉండడంతో డీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రేమోన్మాదం : ఆగమేఘాలపై మరో గంటన్నర వ్యవధిలో సాగిన విచారణతో జకీర్ అనే యువకుడి ప్రేమోన్మాదం ఈ ఘాతంగా ప్రాథమిక దర్యాప్తులు పోలీసులు తేల్చారు. అర్ధరాత్రి సమయంలో జకీర్ కోసం వేట సాగినా, పాలక్కాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ జరిపిన విచారణతో జకీర్ వన్ సైడ్ లవ్ ఉన్మాదం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ధన్యను కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెదిన అనిఫా కుమారుడు జకీర్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. ధన్య తీవ్రంగా హెచ్చరించడంతో కొన్ని నెలల క్రితం పత్తా లేకుండా పోయాడు. అతడి వేధింపుల నుంచి తాను బయట పడ్డటే అని భావించిన ధన్య, చాటుగా తనను జకీర్ తరచూ వెంటాడుతున్న విషయాన్ని గుర్తించ లేకపోయింది. ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపి మరో మారు తన ప్రేమను తెలియజేయడానికి బుధవారం జకీర్ ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే, ధన్య కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమాచారంతో ఉన్మాదిగా మారాడు. తనకు దక్కనిది మరొకడికి దక్కకూడదన్నట్టు ఆక్రోశంతో కిరాతకుడయ్యాడు. ఆమె ఇంటికి వచ్చే వరకు ఆ పరిసరాల్లో మాటు వేశాడు. ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని అదనుగా తీసుకున్నాడు. ఇంటి వెనుక వైపుగా ఉన్న గోడను దూకి,తలుపును తట్టాడు. శబ్దం విన్న ధన్య తలుపు తెరవగానే, తన చేతిలో ఉన్న రాడ్డుతో తలపైకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి ఆగమేఘాలపై పాలక్కాడుకు చేరుకుని, క్రిమిసంహాకరక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ కిరాతకుడ్ని కఠినంగా శిక్షించాలని అన్నూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.