#RohitSharma: 'పదేళ్లుగా మేజర్‌ టైటిల్‌ లేదు.. ఇంత బద్దకం అవసరమా?'

WTC Final: Rohit Sharma Lazy Rurning-Away From Long-Chase Save Runs  - Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్‌ గెలిచిన రోహిత్‌ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ సిరాజ్‌ ఆదిలోనే ఉస్మాన్‌ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

ఆ తర్వాత వచ్చిన లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు స్వేచ్చగా బ్యాట్‌ ఝులిపించడంతో పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 54 పరుగులతో పటిష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ పరిగెత్తడంలో ఎంత బద్దకంగా ఉంటాడో మరోసారి చూపించాడు.

సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ మూడో బంతిని లబుషేన్‌ మిడ్‌వికెట్‌ దిశగా ఆడాడు. అయితే బంతి రోహిత్‌, శార్దూల్‌కు గ్యాప్‌లో వెళ్లింది. ఎలాగూ బౌండరీ పోతుంది అనుకున్నాడేమో తెలియదు కానీ మిడాన్‌లో ఉన్న రోహిత్‌ కనీసం పరిగెత్తే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే షార్ట్‌ మిడ్‌వికెట్‌ వద్ద ఉన్న శార్దూల్‌ మాత్రం బంతి వెనకాలే వేగంగా పరిగెత్తి బౌండరీ రాకుండా అడ్డుపడ్డాడు. దీంతో టీమిండియాకు ఒక పరుగు సేవ్‌ అయింది.  

అయితే రోహిత్‌ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడ్డారు. పదేళ్లుగా ఒక్క మేజర్‌ టైటిల్‌ గెలవలేదు.. డబ్ల్యూటీసీ రూపంలో మరోసారి ఆ చాన్స్‌ వచ్చింది.. అంతటి కీలక మ్యాచ్‌లో పరిగెత్తడంలో ఇంత బద్దకం అవసరమా అంటూ కామెంట్‌ చేశారు. రోహిత్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్‌ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..!

అందుకే అశ్విన్‌ను పక్కనబెట్టాం: రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top