World Junior Shooting Championship: భారత్‌కు 4 స్వర్ణాలు, 2 రజతాలు | World Junior Shooting Championship: 4 Gold Medals For India | Sakshi
Sakshi News home page

World Junior Shooting Championship: భారత్‌కు 4 స్వర్ణాలు, 2 రజతాలు

Oct 4 2021 9:45 AM | Updated on Oct 4 2021 10:08 AM

World Junior Shooting Championship: 4 Gold Medals For India - Sakshi

లిమా (పెరూ): ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో నాలుగింటిలో భారత్‌కు 4 స్వర్ణ పతకాలు, రెండు రజతాలు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో తెలంగాణ షూటర్‌ ధనుశ్‌ శ్రీకాంత్, రాజ్‌ప్రీత్‌ సింగ్, పార్థ్‌ మఖీజాలతో కూడిన భారత జట్టు 16–6తో అమెరికా జట్టును ఓడించి స్వర్ణం సాధించింది.

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ భాకర్‌–సరబ్‌జిత్‌ (భారత్‌) ద్వయం 16–12తో శిఖా–నవీన్‌ (భారత్‌) జోడీ పై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల టీమ్‌ ఫైనల్లో మనూ భాకర్, రిథమ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు 16–12తో బెలారస్‌ జట్టును ఓడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement