చరిత్రను రిపీట్‌ చేస్తాం: పుజారా

We Will Repeat History In Australia Tour, Cheteshwar Pujara - Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో చరిత్ర పునరావృతం అవుతుందని భారత బ్యాట్స్‌మన్‌ పుజారా నమ్మకంగా చెప్పాడు. వార్నర్, స్మిత్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా మారినప్పటికీ... భారత పేసర్ల రాణింపుతో మరోసారి ఆసీస్‌ను ఓడించి టీమిండియా సిరీస్‌ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 71 ఏళ్ల తర్వాత భారత్‌ తొలిసారిగా 2018–19 పర్యటనలో ఆసీస్‌ను టెస్టుల్లో వారి దేశంలో 2–1తో ఓడించింది.

ఈ పర్యటనలో 3సెంచరీలతో కలిపి 500లకు పైగా పరుగులు సాధించిన పుజారా ఈ చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్మిత్, వార్నర్‌ లేనప్పటికీ భారత్‌కు అప్పటి విజయాలు అంత తేలిగ్గా ఏమీ రాలేదని పుజారా అన్నాడు. ఈసారీ తాను బ్యాట్‌తో రాణిస్తానని విశ్వాసం వెలిబుచ్చాడు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top