
PC: IPL.com
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహల్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, కానీ తమకు లభించిన ఆరంభాన్ని కొనసాగించలేకపోయాం అని రాహల్ తెలిపాడు.
రాహుల్ మాట్లాడుతూ.. "మేము ఈ మ్యాచ్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేశాము. కానీ మేము మాకు లభించిన ఘనమైన ఆరంభాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాం. మా జట్టులో నలుగురు ఐదుగురు బ్యాటర్లు బౌండరీ లైన్ వద్ద దొరికిపోయారు. దీంతో మేము మ్యాచ్ మీద పట్టు కోల్పోయాం. అదే మా ఓటమికి ప్రధాన కారణం.
కైల్ మైర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి. అతడు మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కైల్ తనకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇక బిష్ణోయ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కీలక సమయాల్లో మాకు వికెట్లను అందిస్తున్నాడు" అని పేర్కొన్నాడు. ఇక లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్7న ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.
చదవండి: Rishabh Pant: మీకసలు బుద్ధుందా? ఇదేం పని? చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్.. బీసీసీఐ కూడా