ఈడెన్ గార్డెన్స్‌ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు!

We are planning to name a stand after Jhulan Goswami at Eden Gardens - Sakshi

భారత సీనియర్‌ పేసర్‌ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్‌ మూడు వన్డేల సిరీస్‌కు క్లీన్‌ స్వీప్‌ చేసి జూలన్‌కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్‌లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది.

దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ తన కెరీర్‌ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన జులన్‌ 2002లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్‌ జట్టుపై తన కెరీర్‌ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా..  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో ఒక స్టాండ్‌కు  ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని  బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది.

"మేము ఈడెన్‌ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని  ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్‌.  కాబట్టి దిగ్గజ క్రికెటర్‌లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.
చదవండిJhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్‌ నుంచి స్టార్‌ క్రికెటర్‌ దాకా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top