
PC: IPL. COM
టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా.. ఈ సారి ఎలా రాణిస్తుందన్న ఆసక్తి ఇప్పటినుంచే అందరిలో నెలకొంది. టీ-20 ప్రపంచకప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును క్రికెట్ నిపుణులు, మాజీలు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌కు ఆల్ రౌండర్‌లను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఎంచుకున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌కు ఆల్‌రౌండర్‌లగా రవీంద్ర జడేజా,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశాడు. "హార్దిక్ పాండ్యా రెండు,మూడు ఓవర్లు వేయగలిగితే కచ్చితంగా అతడిని సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. ఆల్ రౌండర్ విభాగంలో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ఆల్‌రౌండర్. కాబట్టి జడేజా కూడా టీ20 ప్రపంచకప్‌లో ఉంటాడని భావిస్తున్నాను. నేను జడేజాకు బ్యాకప్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తాను. శార్దూల్ ఠాకూర్‌ను ఒక వేళ ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కడం కష్టం. రాహుల్ తెవాటియా కూడా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్