టెస్ట్‌లకు డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌ బై.. ఎప్పుడంటే..?

Warner Eyes SCG Farewell From Tests In 2024 - Sakshi

ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది (2024) జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ (పాకిస్తాన్‌) ఆడనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం టీమిండియాతో జూన్‌ 7 నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం కఠోరంగా శ్రమిస్తున్న వార్నర్‌.. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని తెలిపాడు. ఈ విషయాలను అతనే స్వయంగా వెల్లడించాడు.  

కాగా, 36 ఏళ్ల వార్నర్‌ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో పెద్దగా రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతనాడిన 17 టెస్ట్‌ల్లో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. అయితే వార్నర్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023లో జట్టు మొత్తం విఫలమైన అతను మాత్రం ఇరగదీశాడు. ఇందుకేనేమో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మరో ఏడాది పాటు కంటిన్యూ కావాలని భావిస్తున్నాడు. 

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వార్నర్‌.. ఇప్పటివరకు 103 టెస్ట్‌లు (25 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 8158 పరుగులు), 142 వన్డేలు (19 సెంచరీలు, 27 హాఫ్‌సెంచరీల సాయంతో 6030 పరుగులు), 99 టీ20లు (సెంచరీ, 24 అర్ధ సెంచరీల సాయంతో 2894 పరుగులు) ఆడాడు. వార్నర్‌ 2009 నుంచి ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున 176 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలు, 61 హాఫ్‌ సెంచరీల సాయంతో 6397 పరుగులు చేశాడు. 

చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top