'పాక్‌ విజయం సాధించాల్సిం‍ది.. కానీ భారత్ మాత్రం అద్బుతం' | Sakshi
Sakshi News home page

పాక్‌ విజయం సాధించాల్సిం‍ది.. కానీ భారత్ మాత్రం అద్బుతం: వకార్‌ యూనిస్‌

Published Mon, Jun 10 2024 8:40 PM

Waqar Younis lauds team Indias balance following win over Pakistan

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌మ భార‌త్ త‌మ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయ‌ర్క్ వేదిక‌గా దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన రోహిత్ సేన‌.. బౌలింగ్‌లో మాత్రం విజృభించింది. 

120 ప‌రుగులు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని డిఫెండ్ చేసిన భార‌త బౌల‌ర్లు త‌మ జ‌ట్టుకు అద్భుమైన విజ‌యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో భారత జ‌ట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియా అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌గా ఉంద‌ని వకార్ యూనిస్ కొనియాడాడు.

"ఈ మ్యాచ్‌లో భార‌త్ బ్యాటింగ్‌లో విఫ‌ల‌మకావ‌డంతో పాకిస్తాన్ ఈజీగా విజ‌యం సాధిస్తుంద‌ని నేను భావించాను. తొలుత భార‌త జ‌ట్టు బ్యాటింగ్ చూసి పాక్ ముందు 140 నుంచి 150 ప‌రుగుల స్కోర్ ఉంచుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ ఆఖ‌రిలో వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డం అనుకున్న టార్గెట్‌కు చేరుకోలేక‌పోయింది. అయితే భార‌త జ‌ట్టు మాత్రం అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌గా ఉంది. ఒకవేళ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైతే బౌల‌ర్లు యాక్ష‌న్‌లోకి వ‌స్తారు.  జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి అద్బుత‌మైన బౌల‌ర్లు ఉన్నారు. వారి ఫీల్డింగ్ కూడా అత్యుత్త‌మంగా ఉంటుంది. 

అందుకే భార‌త్ సూప‌ర్ టీమ్‌గా క‌న్పిస్తోంది. పాక్‌కు ఆరంభం వ‌చ్చిన‌ప్పటికి స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయారు. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. అందుకే స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా చేధించ‌లేక‌పోయారని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వకార్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement