శెభాష్‌ తల్లీ.. గ్రీష్మ‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌ | Vizag: CM YS Jagan Lauds Asian Games Winner Dontara Greeshma - Sakshi
Sakshi News home page

శెభాష్‌ తల్లీ.. గ్రీష్మ‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

Nov 2 2023 5:13 PM | Updated on Nov 2 2023 6:08 PM

Vizag: CM YS Jagan Lauds Asian Games Winner Dontara Greeshma - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్కేటింగ్ క్రీడాకారిణి, ఆసియా క్రీడ‌ల విజేత గ్రీష్మ దొంత‌ర‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అభినందించారు. ప్రతిభావంతురాలైన గ్రీష్మ ఆట తీరు.. ఆమె సాధించిన విజ‌యాలను ప్ర‌శంసించారు. కాగా.. ఒక్కరోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ గురువారం విశాఖ‌ప‌ట్నం వచ్చారు.

ఈ క్రమంలో.. న‌గ‌రానికి చెందిన‌ గ్రీష్మ దొంత‌ర‌ త‌న తండ్రితో పాటు మ‌ధుర‌వాడ ఐటీ హిల్‌పైన హెలీప్యాడ్ వ‌ద్ద సీఎంను క‌లిశారు. ఈ సందర్భంగా గ్రీష్మ.. త‌ను సాధించిన మెడ‌ళ్ల‌ను ముఖ్య‌మంత్రికి చూపించి మురిసిపోయారు. స్కేటింగ్‌లో తన విజయాల గురించి సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించారు.

105 పతకాలు
ఈ నేపథ్యంలో శెభాష్ త‌ల్లీ అంటూ చిరున‌వ్వుతో గ్రీష్మను అభినందించిన సీఎం జగన్‌.. జీవితంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ంటూ ఆమెకు ఆశీర్వాదం అందించారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు స్కేటింగ్‌లో వివిధ స్థాయిల్లో 105 మెడ‌ల్స్ సాధించినట్లు గ్రీష్మ తెలిపారు.

అదే విధంగా.. ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన 19వ ఆసియా క్రీడల్లో భాగ‌స్వామ్యం అయ్యాన‌ని.. మూడు ప‌త‌కాలు కూడా సాధించి 16వ స్థానంలో నిలిచాన‌ని పేర్కొన్నారు.

చదవండి: #Virat Kohli: నీకే ఎందుకిలా కోహ్లి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement