విశ్వనాథన్‌ ఆనంద్‌ బోణీ | Viswanathan Anand Won The Match In Legends Online Chess Tournament | Sakshi
Sakshi News home page

విశ్వనాథన్‌ ఆనంద్‌ బోణీ

Jul 28 2020 1:04 AM | Updated on Jul 28 2020 1:04 AM

Viswanathan Anand Won The Match In Legends Online Chess Tournament - Sakshi

చెన్నై: లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్, భారత నంబర్‌వన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుసగా స్విద్లెర్, కార్ల్‌సన్, క్రామ్నిక్, అనీశ్‌ గిరి, పీటర్‌ లెకో, నెపోమ్‌నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్‌ ఏడో రౌండ్‌ గేమ్‌లో ఇజ్రాయెల్‌ గ్రాండ్‌మాస్టర్‌ గెల్‌ఫాండ్‌ బోరిస్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్‌లో ఆనంద్‌ 2.5–0.5తో బోరిస్‌పై నెగ్గాడు.

Advertisement
 
Advertisement
Advertisement