జాతీయ క్రీడా పురస్కారాల  కమిటీలో సెహ్వాగ్, సర్దార్‌

Virendra Sehwag And Sardar Singh In The National Sports Awards Committee - Sakshi

12 మంది సభ్యుల ప్యానల్‌ నియామకం

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్‌ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్‌ వెంకటేశన్‌ దేవరాజన్, ‘సాయ్‌’ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్‌ సింగ్, ‘టాప్స్‌’ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా    సెలక్షన్‌ కమిటీలోని ఇతర సభ్యులు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top