ఆయన సహకారంతోనే ఈ స్థాయికి: కోహ్లి

Virat Kohli Says He Is Grateful For Childhood Coach  - Sakshi

ముంబై: ప్ర‌పంచ క్రికెట్‌ చరిత్రలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏ స్థాయిలో రాణిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను కోహ్లి సంపాధించుకున్నాడు. యూత్‌కు ప్రేరణగా నిలిచిన కోహ్లి మాత్రం తన విజయాలకు చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ అని శనివారం సోషల్‌ మీడియాలో తెలిపాడు. కాగా కోచ్‌ రాజ్‌కుమార్‌తో తన అనుబంధాన్ని వివరించాడు. అయితే ఏ వ్యక్తి జీవన ప్రయాణంలోనైనా గురువు విలువైన పాఠాలు బోధిస్తారని తెలిపాడు. అయితే తన కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ అందించిన సహకారం మరువలేనని అన్నాడు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోచ్‌ రాజ్‌కుమార్‌ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తామంతా ఈ స్థాయిలో రాణించడానికి ఉపాధ్యాయులు, క్రికెట్ కోచ్‌లే కారణమని పేర్కొన్నాడు. (చదవండి: వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top