Ind Vs Pak: Virat Kohli Beats Rohit Sharma To Become Highest Run Scorer In T20I Cricket - Sakshi
Sakshi News home page

T20 WC IND VS PAK: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌ కోహ్లి

Oct 23 2022 6:34 PM | Updated on Oct 26 2022 12:39 PM

Virat Kohli Overtakes Rohit Sharma To Become Highest Run Scorer In T20I Cricket - Sakshi

అసలుసిసలైన టీ20 క్రికెట్‌ మజా ఇవాళ (అక్టోబర్‌ 23) జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో దొరికింది. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్‌-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడంతో భారత్‌ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని సాధించింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌, ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి (24).. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ రికార్డును (23) అధిగమించాడు.

అలాగే, రోహిత్‌ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (అంతర్జాతీయ టీ20ల్లో) రికార్డును కూడా కోహ్లి ఈ మ్యాచ్‌లోనే అధిగమించాడు. రోహిత్‌ ఇప్పటివరకు టీ20ల్లో 3741 (143 మ్యాచ్‌ల్లో) పరుగులు చేయగా.. విరాట్‌ 110 ఇన్నింగ్స్‌ల్లోనే 3794 పరుగులు చేసి టీ20ల్లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా అవతరించాడు. ఈ జాబితాలో విరాట్‌, రోహిత్‌ తర్వాత మార్టిన్‌ గప్తిల్‌ (3531), బాబర్‌ ఆజమ్‌ (3231) ఉన్నారు. 
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ‘విరాట పర్వం’లో విజయం మనదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement