Virat Kohli Emerged Most Valuable Celebrity In India, Details In Telugu - Sakshi
Sakshi News home page

కోహ్లీ కా కమాల్‌! బ్రాండ్‌ పరంగా కోహ్లినే టాప్‌

Mar 30 2022 9:11 AM | Updated on Mar 30 2022 12:29 PM

Virat Kohli Emerged Most Valuable Celebrity In India - Sakshi

ముంబై: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీ– 2021గా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నిలిచాడు. అంతకుముందేడాదితో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గినా సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్‌ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్‌ వాల్యూ 23.77 కోట్ల డాలర్లుండగా, 2021లో 18.57 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,400 కోట్లు) పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌ తెలిపింది.

వరుసగా ఐదేళ్లుగా ఈ జాబితాలో కోహ్లీనే టాప్‌లో ఉంటున్నారు. కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆక్రమించారు. రణ్‌వీర్‌ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో హిందీ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. ఒలింపిక్‌ విజేత పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు. 

(చదవండి: పుతిన్‌ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది.. క్షమాపణలు చెప్పను: బైడెన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement