చరిత్ర సృష్టించిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా | virat kohli Becomes most runs in t20 world cup | Sakshi
Sakshi News home page

T20 WC 2022: చరిత్ర సృష్టించిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Nov 2 2022 2:10 PM | Updated on Nov 2 2022 6:11 PM

virat kohli Becomes most runs in t20 world cup - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అ‍త్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు 23 టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 1065 పరుగులు సాధించాడు.

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా బంగ్లా దేశ్‌తో మ్యాచ్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉండేది.  జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో జయవర్ధేనే రికార్డు కోహ్లి బ్రేక్‌ చేశాడు.
చదవండిT20 WC 2022: బాబర్‌పై గంభీర్‌ విమర్శలు, ఆఫ్రిది గట్టి కౌంటర్‌.. టోర్నీ అయ్యాక చెబుతా!

Advertisement
 
Advertisement
Advertisement