Michael Clarke: ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెంపలు వాయించిన గర్ల్‌ఫ్రెండ్

Michael Clarke Slapped By Girl Friend: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ (2015) అయిన మైఖేల్ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో (పిప్ ఎడ్వర్డ్స్) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్ జేడ్ యాబ్రో బహిరంగంగా క్లార్క్ చెంపులు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating.
Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc
— SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023
ఈ వీడియోలో క్లార్క్.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వప్రయాత్నాలు చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. భూతులు తిడుతూ.. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వో మదమెక్కిన కుక్కవు అంటూ పబ్లిక్‌గా క్లార్క్‌పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లార్క్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. సదరు మహిళతో చేసిన ఫోన్ చాట్‌ను బయటపెట్టాలని జేడ్ గట్టిగా డిమాండ్ చేసింది.
ఆ సమయంలో జేడ్ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు. ఆ ముగ్గురు సంఘటన స్థలాన్ని విడిచి వెళ్తుండగా.. క్లార్క్ వారికి అడ్డుతగలడంతో జేడ్ మరింత రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. క్లార్క్ కుంటుతూ వారి వెంబడి పడే ప్రయత్నం చేశాడు. ఈ ఉదంతంపై క్లార్క్ స్పందిస్తూ.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు.
కాగా, క్లార్క్.. తన భార్య కైలీని వదిలేసి గతకొంతకాలంగా ప్రముఖ మోడల్ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. 41 ఏళ్ల క్లార్క్.. ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్ అత్యధిక స్కోర్ 329 నాటౌట్‌గా ఉంది.
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు