కలిస్‌, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్‌ శంకర్‌కు చివాట్లు

 Vijay Shankar Trolled For Comparing With Jacques Kallis And Shane Watson - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ట్విటర్‌ వేదికగా తనను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్లైన కలిస్‌, వాట్సన్‌లతో పోల్చుకోవడంపై క్రికెట్‌ అభిమానులు భగ్గుమన్నారు. సోషల్‌ మీడియాలో అతన్ని ట్రోల్‌ చేస్తూ చివాట్లు పెట్టారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. తాను టీమిండియాకు కలిస్‌, షేన్‌ వాట్సన్ లాంటి ఆల్‌రౌండర్‌నని సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నాడు. 

దిగ్గజ ఆల్‌రౌండర్లలానే తాను కూడా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్ధుడినని, ఎటువంటి సందర్భంలోనైనా బౌల్‌ చేయగల సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. తాను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేశానని, అదే తన రెగ్యులర్‌ స్లాట్‌ అయితే అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికలుంటాయని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో తాను వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన విషయాన్ని ఆయన ప్రస్థావించాడు. 

అయితే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగడం వల్ల తాను 30, 40 పరుగులకు మించి స్కోర్‌ చేయలేకపోయానని, ఇటువంటి ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థానం ఆశించడం కూడా సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, శంకర్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్ధం చేసుకుని ట్రోల్‌ చేశారు. శంకర్‌ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఆడాడు. ఆ మెగా టోర్నీలో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడుని కాదని శంకర్‌ ఆవకాశం దక్కించుకున్నాడు.
చదవండి: కోహ్లి సేనకు వ్యాక్సిన్‌ రెండో డోసు అక్కడే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top