బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్.. తొలి భారత క్రికెటర్‌గా!

Unmukt Chand becomes first Indian to be drafted in BPL - Sakshi

2012 అండర్ 19 ప్రపంచకప్‌ను ఉన్ముక్త్‌ చంద్‌ సారథ్యంలోని యువ భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం ఉన్ముక్త్‌ చంద్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత క్రికెట్‌లో మరో విరాట్‌ కోహ్లి అవుతాడని అంతా భావించారు.

అయితే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు రాకపోవడంతో 2021లో భారత్‌ను వీడి యుఎస్‌ఏకు వలస వెళ్లాడు.

ఇక భారత్‌ను వీడి వెళ్లిన చంద్‌ విదేశీ లీగ్‌ల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు సాధించిన చంద్‌.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2022 సీజన్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఉన్ముక్త్‌ చంద్‌ ఆడనున్నాడు. తద్వారా బీపీఎల్‌లో డ్రాఫ్ట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వేలంలో కూడా చంద్‌ తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఏ ప్రాం‍ఛైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్‌ కార్తీక్‌ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్‌ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top